Q:. నాకు పెళ్లయి మూడు నెలలు అయ్యింది. అంగస్తంభన బాగానే జరుగుతోంది. కానీ నా భార్య యోనిలోకి పురుషాంగం ప్రవేశించే సమయంలో, దాని చివరన ఉన్న చర్మం వెనక్కు పోలేక విపరీతమైన నొప్పి వచ్చి వెంటనే అంగస్తంభన తగ్గిపోతోంది. ఈ సమస్య వల్ల గత మూడు నెలల్లో ఒక్కసారి కూడా అంగప్రవేశం చేయలేకపోయాను. మామూలుగా చర్మం వెనక్కు వెళ్లినా అంగస్తంభన జరిగినా కింది భాగంలో ఏదో పట్టుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
A:
అంగం మీద ఉన్న చర్మం ఫ్రెన్యులమ్ అనే పొర ద్వారా అంగం కింది భాగంలో అతుక్కుని ఉంటుంది. ఇది కొందరిలో బిగుతుగా ఉంటుంది. అందువల్ల అంగస్తంభన జరిగినప్పుడు అది వెనక్కు రాదు. ఒక్కోసారి బలవంతంగా సెక్స్ చేసినప్పుడు ఫ్రెన్యులమ్ చిట్లిపోయి తీవ్రంగా రక్తస్రావం కూడా జరగవచ్చు. దీన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అనే కేవలం 15 నిమిషాల ప్రొసీజర్తో నయం చేయవచ్చు. దీనికి మత్తుమందు కూడా అవసరం లేదు. లోకల్ అనస్థీషియా ఇస్తే చాలు. ఒక గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు. (అంటే ఇది డే కేర్ సర్జరీ అన్నమాట). అందువల్ల మీరు నిశ్చితంగా ఈ ఫ్రెన్యులోప్లాస్టీ చేయించుకుని నిరాటంకంగా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
0 comments:
Post a Comment